Chorus
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
Verse
యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
అవనిలో అగచాట్లపాలైన అబ్బదుశాంతి ఆత్మకు నిలలో‖ రండి ‖
Verse
కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి చ్చుచున్నారు‖ రండి ‖
Verse
ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యాఘనుడు మనకై‖ రండి ‖
Verse
యేసుని నామమునందే పరమ నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును‖ రండి ‖
Verse
నేనే మార్గము, నేనే సత్యము నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు‖ రండి ‖