Chorus
రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు
Pre-Chorus
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభునిచెంతకు పరుగిడి వేగమె
Verse
యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో
Verse
కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనసు
ప్రవచనములు సంపూర్ణము లాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు
Verse
ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను ఆ ఘనుడు మనకై
Verse
యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును
Verse
నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును
నేనే గాకింకెవ్వరు లేరని
యెంచి చెప్పిన యేసుని యొద్దకు