Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Suvaartha Sunaadamutho

రండి సువార్త సునాదముతో

Randi Suvaartha Sunaadamutho

Verse
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి‖ 2x రండి ‖
Verse
యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం
భాసుర క్రైస్తవ శుభ నామం‖ రండి ‖
Verse
యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం‖ రండి ‖
Verse
యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్ధన సహకారం‖ రండి ‖
Verse
యేసే సంఘములో మన కాంతి
యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి‖ రండి ‖
Verse
యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జన స్తోత్రం‖ రండి ‖

Related Tags

PraiseWorshipGospel