Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Suvaartha Sunaadhamuthoa Ranjilu

రండి సువార్త సునాదముతో రంజిలు

Randi Suvaartha Sunaadhamuthoa Ranjilu

Lyricist: A B Masilamani
Chorus
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభుయేసు దయానిధి సన్నిధికి
Verse
యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం
భాసర క్రైస్తవ శుభనామం‖ రండి ‖
Verse
యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం‖ రండి ‖
Verse
యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్థన సహకారం‖ రండి ‖
Verse
యేసే సంఘములో మనకాంతి
యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి‖ రండి ‖
Verse
యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం.‖ రండి ‖

Related Tags

PraiseWorshipGospel