Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Suvartha Sunadamuto Ranjilu Siluva

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ

Randi Suvartha Sunadamuto Ranjilu Siluva

Verse 1
రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి
Verse
యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామం
Verse
యేసే దేవుని ప్రేమస్వరూపి యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం
Verse
యేసే సిలువను మోసినదైవం యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం
Verse
యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవనజ్యోతి పసిపాపల దీవెన మూర్తి
Verse
యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికిసూత్రం వాసిగనమ్మిన జనస్తోత్రం

Related Tags

PraiseGospelJesus