Verse
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే‖ 2x ‖
Verse
రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము‖ 2x ‖
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము‖ రండి ‖
Verse
మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు‖ 2x ‖
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే‖ రండి ‖
Verse
సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్‖ 2x ‖
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము‖ రండి ‖
Verse
ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము‖ 2x ‖
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును‖ రండి ‖
Verse
తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు గాక‖ 2x ‖
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్‖ రండి ‖