Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Yehovanugurchi Santhosha Ganamu Cheyudamu

రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము

Randi Yehovanugurchi Santhosha Ganamu Cheyudamu

Verse
రండి యెహోవానుగూర్చి - సంతోష గానము చేయుదము
Verse
మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము
కృతజ్ఞతాస్తుతుల తోడ
Verse
మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన
మహాత్మ్యము గల మహారాజు
Verse
భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి
పర్వత శిఖరము లాయనవే
Verse
సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను
తన ప్రజలము గొఱ్ఱెలము మనము
Verse
యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదము
మనల సృజించిన దేవునికి
Verse
నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు మనోహరము

Related Tags

PraiseWorshipPsalm