Chorus
రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు
రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను
బ్రాణము రండి‖ రండి ‖
Verse
మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి
మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన
దరి రండి‖ రండి ‖
Verse
మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి
లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును
మెండగు దుఃఖము రండి‖ రండి ‖
Verse
మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు
చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ
దేవుఁడు రండి‖ రండి ‖