Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Yutchahinchi Paadudhamu Rakshanadurgamu Mana Prabhuve

రండి యుత్చాహించి పాడుదము రక్షణదుర్గము మన ప్రభువే

Randi Yutchahinchi Paadudhamu Rakshanadurgamu Mana Prabhuve

Verse
రండి యుత్చాహించి పాడుదము - రక్షణదుర్గము మన ప్రభువే
Verse
రండి కృతజ్ఞత స్తో్త్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము‖ రండి ‖
Verse
మన ప్రభువే మహదేవుండు - ఘన మహత్మ్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును - భూతల శిఖరములాయనవే‖ రండి ‖
Verse
సముద్రము సృష్టించె నాయననే - సత్యుని హస్తమే భువిఁ జేసెన్
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము‖ రండి ‖
Verse
ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మీకెంత మేలగును‖ రండి ‖
Verse
తండ్రికుమార శద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమేన్‖ రండి ‖

Related Tags

PraiseWorshipThanksgiving