Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Yutsahinchi Paadudamu Rakshana

రండి యుత్సహించి పాడుదము రక్షణ

Randi Yutsahinchi Paadudamu Rakshana

Lyricist: సమూయేలు పాక్యవాధము
Chorus
రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
Verse
రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు
నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము‖ రండి ‖
Verse
మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య
గాధపులోయలును భూధర శిఖరము లాయనవే‖ రండి ‖
Verse
సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము‖ రండి ‖
Verse
ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును‖ రండి ‖
Verse
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్‖ రండి ‖

Related Tags

PraiseWorshipPsalm