Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Yutsahinchi Paadudumu Rakshana Dur

రండి యుత్సహించి పాడుదుము రక్షణ దుర్

Randi Yutsahinchi Paadudumu Rakshana Dur

Verse
రండి యుత్సహించి పాడుదుము రక్షణ దుర్గము మన ప్రభువే
Verse
రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదుము
సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము
Verse
మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యగాధపులోయలును భూధర శిఖరము లాయనవే
Verse
సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము
Verse
ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును
Verse
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదినినిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్

Related Tags

PraiseWorshipThanksgiving