Chorus
రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు
సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు
నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం‖ విజయం ‖
Verse
నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును
వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్‖ విజయం ‖
Verse
కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ
బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్‖ విజయం ‖
Verse
బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు
లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా
వలియు ముద్రయు‖ విజయం ‖
Verse
పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల
తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు‖ విజయం ‖