Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ratnavarnuda Karuna Sampannuda

రత్నవర్ణుడా కరుణా సంపన్నుడా

Ratnavarnuda Karuna Sampannuda

Lyricist: Pastor Praveen
Verse
రత్నవర్ణుడా కరుణా సంపన్నుడా
నీతిసూర్యుడా నా రక్షణ శృంగమా
ప్రేమించినావు ప్రాణమిచ్చినావు
రక్షించినావు హెచ్చించినావు
నీ కృపనే ధ్యానింతును యేసయ్య
నీ ప్రేమనే ప్రకటింతును
Verse
అందరు ఉన్నారని అందరు నావారని
నమ్మితిని మోసపోతిని
ఒంటరిగా నిలిచితిని యేసయ్య
నీవైపే చూచితిని
Verse
గాడాంధకారములో నేను సంచరించిన
అలసితిని సొలసితిని
నడవలేక ఆగిపోతిని యేసయ్య
నిను వెంబడించితిని
Verse
నీలాగే ఉండాలని నీలోనే నడవాలని
నీ సాక్షిగా బ్రతకాలని నీ సేవలో సాగాలని
నీ మహిమలో నిలవాలని యేసయ్య
నీ కృపనే కోరితిని

Related Tags

WorshipGraceJesus