Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ravikanthini Minchinadau Oka Deshamu

రవికాంతిని మించినదౌ ఒక దేశము

Ravikanthini Minchinadau Oka Deshamu

Verse
రవికాంతిని మించినదౌ
ఒక దేశము దూరమున
వరభక్తులు చూచెదరు
తండ్రి యాశ్రయ మిచ్చునటన్
Chorus
అహహా త్వరలో
మేము చేరుదు మా స్థలమున్
అహహా త్వరలో
మేము చేరుదు మా స్థలమున్‖ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ ‖
Verse
దుఃఖబాధలు లేక సదా
పూర్ణశాంతినిఁ బొందుచును
పరిశుద్ధుల కీర్తనలు
అందు నెప్పుడు బాడుదుము.
Verse
ప్రేమ సాగరుఃడౌ జనకున్
మాకు నిచ్చిన మేలులకై
మా కృతజ్ఞత జూపుచును
నిత్యమున్ స్తుతి యించెదము

Related Tags

PraiseHeavenEternal Life