Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ravikoti Thejudu Naa Devude Naaku Praana Snehithudu

రవికొటి తేజుడు నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు

Ravikoti Thejudu Naa Devude Naaku Praana Snehithudu

Lyricist: Kranthi Chepuri
Verse
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
నా దేవుడే నాకు మార్గ దర్శకుడు
నా దేవుడే నాకు నిత్య పోషకుడు
నా దేవుడే నాకు జీవన దాయకుడు
గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే
మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే‖ నా దేవుడే ‖
Verse
శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను
నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు
మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను
నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు
క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము
క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము
క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను‖ గతి లేని ‖
Verse
వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను
నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము
ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను
నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము
నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా
నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే
విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను‖ గతి లేని ‖

Related Tags

PraiseThanksgiving