Verse
రెండే రెండే దారులు
ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం‖ 2x ‖
పరలోకం కావాలో పాతాళం కావాలో
తెలుసుకో మానవా‖ 2x ‖
Verse
పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం‖ 2x ‖
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును‖ 2x ‖
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును‖ 2x ‖
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు‖ 2x రెండే ‖
Verse
పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం‖ 2x ‖
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు‖ 2x ‖
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు‖ 2x ‖
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు‖ 2x రెండే ‖
Verse
పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా‖ 2x ‖
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు‖ 2x ‖
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి‖ 2x ‖
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో‖ 2x రెండే ‖