Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Reyimpagalu Nee Padasheve Yesu Prabhu

రేయింపగలు నీ పదసేవే యేసు ప్రభు

Reyimpagalu Nee Padasheve Yesu Prabhu

Chorus
రేయింపగలు నీ పదసేవే యేసు ప్రభువా చేయుటమేలు
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె
Verse
పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి
శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె‖ రేయి ‖
Verse
జిగటమన్నే మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా‖ రేయి ‖
Verse
పెంటకుప్పలనుండి దీనుల పైకిలేపు ప్రభుడవు నీవే
గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి‖ రేయి ‖
Verse
నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె రాజరాజవు నాకాశ్రయము‖ రేయి ‖
Verse
అగ్నివాసననంటకుండా అబెద్నగోలతో నుండి నదేవా
దానియేలును సింహపుబోనులో ఆదుకొన్న నాధుడనీవె‖ రేయి ‖
Verse
పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పదము నీవే
అడుగుజాడల నడచిన హనోకు పరముచేరె ప్రాణముతోడ‖ రేయి ‖
Verse
మృతుల సహితము లేపినావు మృతినిగెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు మృత్యువును మృతిలేపినావు‖ రేయి ‖

Related Tags

WorshipDevotionalPrayer