Verse
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు‖ 2x ‖
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని‖ 2x రుచి చూచి ‖
Verse
గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే‖ 2x ‖
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే‖ 2x రుచి చూచి ‖
Verse
మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా‖ 2x ‖
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్‖ 2x రుచి చూచి ‖
Verse
మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో‖ 2x ‖
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు‖ 2x రుచి చూచి ‖
Verse
కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను‖ 2x ‖
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను‖ 2x రుచి చూచి ‖
Verse
ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి‖ 2x ‖
సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని‖ 2x రుచి చూచి ‖