Chorus
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని‖ రుచి చూచి ‖
Verse
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే‖ రుచి చూచి ‖
Verse
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్‖ రుచి చూచి ‖
Verse
మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో
ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు‖ రుచి చూచి ‖
Verse
ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి‖ రుచి చూచి ‖