Verse
రుచిచూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని
Verse
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే
Verse
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడదను నీ ఆశ్చర్య కార్యములన్
Verse
మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు
Verse
నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్
Verse
సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో
ఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు
Verse
ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
Verse
కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను