Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saageti Ee Jeeva Yaathralo

సాగేటి ఈ జీవ యాత్రలో

Saageti Ee Jeeva Yaathralo

Verse
సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో‖ 2x ‖
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో‖ 2x ‖
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా‖ 2x సాగేటి ‖
Verse
సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన‖ 2x ‖
నడిపించగలిగిన నా చుక్కాని నీవే‖ 2x ‖
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే‖ 2x యేసయ్యా ‖
Verse
వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన‖ 2x ‖
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే‖ 2x ‖
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే‖ 2x యేసయ్యా ‖
Verse
అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన‖ 2x ‖
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే‖ 2x ‖
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipLife Journey