Verse
పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను
విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు‖ 2x ‖
హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ‖ 2x ‖
Verse
ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను
కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను‖ 2x ‖
నా సహాయకుడు - నా కాపరి యేసే‖ 2x …హల్లెలూయ… ‖
Verse
పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా - నేను భయపడను‖ 2x ‖
నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే‖ 2x …హల్లెలూయ… ‖
Verse
పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం‖ 2x ‖
నాకు కేడెము - నా కోటయు యేసే‖ 2x …హల్లెలూయ… ‖