Verse
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక‖ 2x ‖
యేసుతోనే కడవరకు పరముదాక
యేసయ్యతోనే కడవరకు పరముదాక
వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక‖ 2x ‖
విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా
నా హృదయమా‖ సాగి ‖
Verse
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం
ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా‖ 2x ‖
ఇమ్మానుయేలు నీకు తోడుండగా‖ 2x ‖
విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా
ఎంతో వింతగా‖ సాగి ‖
Verse
పాపమందు నిలచిన పడిపోదువు
పరలోక యాత్రలో సాగకుందువు‖ 2x ‖
ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా‖ 2x ‖
నిత్య జీవ మార్గమందు సాగిపోదువు
కొనసాగిపోదువు‖ సాగి ‖
Verse
విశ్వాస పోరాటంలో విజయ జీవితం
విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును‖ 2x ‖
విలువైన ఆత్మతో బలము నొందుము‖ 2x ‖
వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు
పడిపోక నిలుతువు‖ సాగి ‖