Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saagilapadi Aaradhinchedamu Satyamutho Aatmatho Sri Yesun

సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్

Saagilapadi Aaradhinchedamu Satyamutho Aatmatho Sri Yesun

Chorus
సాగిలపడి ఆరాధించెదము
సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్
Verse
దూతలు కనపడి గానము చేసిరి
సతతము మహిమ సర్వోన్నతునికి
శాంతియు భువిలో పరిశుద్ధులకు
పావనుడేసుని పూజించెదము
Verse
గొల్లలు గాంచిరి ఘనకాపరిని
ఉల్లములెల్లను రంజిల్లగను
ఎల్లరకు చాటిరి వల్లభుని
ఉల్లాసముతో కొనియాడెదము
Verse
జ్ఞానులు గనిరి ఘనమగు తారన్
పూనికతో పయనము గావించి
కానుకలిడి పూజించిరి రాజున్
తనివి తీరగ ఘనపరచెదము
Verse
మరియ ప్రభుదయ విరివిగ బొంది
ప్రణుతించెను ప్రభు దర్శనమొంది
పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు
మురియుచు మదిలో మ్రొక్కెద మిపుడే
Verse
సుమెయోను స్తుతియించె దేవుని
గమనించె ఘన రక్షణ నరులకు
నిర్మల వెలుగు నిర్మల మహిమ
విమలుని మరి మరి స్తుతియించెదము
Verse
వివరించెనన్న విమోచకుని
విశ్వాసులకు పరిశుద్ధులకు
దేవుని స్తుతియించుచు నీ భువిలో
పవిత్రుని బహు పూజించెదము
Verse
పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు
రాజులరాజు ప్రభువుల ప్రభువు
రాజ్యము నిచ్చెన్ రాజుల జేసెను
విజయుడు యేసుని పూజించెదము

Related Tags

WorshipChristmasAdoration