Chorus
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ‖ 2x సాగిలపడి ‖
Verse
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్‖ 2x ‖
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు‖ 2x ‖
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్‖ 2x ‖
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్‖ 2x ‖
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు‖ 2x ‖
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్‖ 2x ‖
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖
Verse
అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు‖ 2x ‖
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము‖ 2x సాగిలపడి ‖