Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saagilapadi Mrokkedamu Satyamutho

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో

Saagilapadi Mrokkedamu Satyamutho

Chorus
సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ....
Verse
మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్
వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము
Verse
అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము
Verse
ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము
Verse
యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్
మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము
Verse
సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము
Verse
రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము
Verse
అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము

Related Tags

WorshipJesus Christ