Chorus
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ‖ 2x ‖
Verse
మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్‖ 2x ‖
వేషధారులన్ ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము‖ 2x Saagilapadi ‖
Verse
అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు‖ 2x ‖
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము‖ 2x Saagilapadi ‖
Verse
ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగా తానే యుండెన్‖ 2x ‖
ఆలయము మీరే అనెను
ఎల్లకాలము మ్రొక్కెదము‖ 2x Saagilapadi ‖
Verse
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము‖ 2x Saagilapadi ‖