Verse
సాగిపోదును – ఆగిపోను నేను
విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు‖ 2x ‖
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ‖ 2x ‖
Verse
ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను‖ 2x ‖
నా సహాయకుడు – నా కాపరి యేసే‖ 2x ‖
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ‖ 2x ‖
Verse
పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా – నేను భయపడను‖ 2x ‖
నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే‖ 2x ‖
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ‖ 2x ‖
Verse
పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం‖ 2x ‖
నాకు కేడెము – నా కోటయు యేసే‖ 2x ‖
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ‖ 2x ‖