Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saakshya Michchedha Swaami Yesu De

సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దే

Saakshya Michchedha Swaami Yesu De

Lyricist: Mallela David
Verse
సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ
గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను
స్వామి రక్షించె నంచు‖ సాక్ష్య ‖
Verse
దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు
నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో‖ సాక్ష్య ‖
Verse
పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల
కును బ్రేమతో నా స్వానుభవము‖ సాక్ష్య ‖
Verse
బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని
గూర్చి నాకుఁ దెలిసినంత వరకు‖ సాక్ష్య ‖
Verse
పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల
క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు‖ సాక్ష్య ‖
Verse
చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు
కూర్మితో రక్షించు నంచు‖ సాక్ష్య ‖
Verse
పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు
వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు‖ సాక్ష్య ‖
Verse
ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును
తండ్రి కుమా రాత్మ పేర‖ సాక్ష్య ‖

Related Tags

TestimonyEvangelismWitness