Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saakshyamichcheda

సాక్ష్యమిచ్చెద

Saakshyamichcheda

Lyricist: Mallela Daaveedu
Verse
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే‖ 2x ‖
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు‖ సాక్ష్య ‖
Verse
దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి‖ 2x ‖
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో‖ సాక్ష్య ‖
Verse
పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు‖ 2x ‖
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము‖ సాక్ష్య ‖
Verse
బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల‖ 2x ‖
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు‖ సాక్ష్య ‖
Verse
పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు‖ 2x ‖
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు‖ సాక్ష్య ‖
Verse
చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన‖ 2x ‖
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు‖ సాక్ష్య ‖
Verse
పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల‖ 2x ‖
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు‖ సాక్ష్య ‖
Verse
ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక‖ 2x ‖
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర‖ సాక్ష్య ‖

Related Tags

PraiseTestimonyGospel