Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saathwikamunu Kanaparachavalenu

సాత్వికమును కనపరచవలెను

Saathwikamunu Kanaparachavalenu

Lyricist: A R Stevenson
Verse
సాత్వికమును కనపరచవలెను
కనికరముతో అందరియెడలను
ప్రతి సత్కార్యము చేయుటకును
సిద్ధపడియుండవలెను
Chorus
పోగొట్టుకోకు ఎవరినైనను
ప్రేమతో రక్షించు కొందరినైనను
Verse
దేవుని దయను మనుష్యుల దయను
యేసు సంపాదించెను
ఎవ్వరితో విరోధము కూడదు
అందరితోనూ సమాధానము
Verse
జ్ఞానము చివరకు నిరర్ధకమగును
ప్రేమ శాశ్వతముండును
వాక్యమును పఠించిన చాలదు
పాటించితేనే ఆశీర్వాదము
Verse
చూసిన మనలో ఆత్మఫలమును
క్రీస్తు సంతోషించును
గర్వముతో పరిస్థితి మారదు
మేలుతోనే కీడుపై విజయము

Related Tags

GospelChristian LifeHumility