Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saati Evvaru

సాటి ఎవ్వరూ

Saati Evvaru

Lyricist: Joel N Bob
Verse
సాటి ఎవ్వరూ లేరు ఇలలో
సమానులెవ్వరూ ఇహ పరములో‖ 2x ‖
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షణనిచ్చావు‖ సాటి ఎవ్వరూ ‖
Chorus
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును‖ 4x ‖
Verse
పాప బానిస బ్రతుకు
ఆకర్షణ నిండిన లోకం
సర్వమనే భ్రమలోనే బ్రతికానే
నీ వాక్యముతో సంధించి
నా ఆత్మ నేత్రములు తెరచి
ప్రేమతో నన్నాకర్షించావే‖ 2x ‖
Chorus
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును‖ 2x ‖
Verse
మలినమైన మనసు
గమ్యంలేని పయనం
హృదయమే చీకటిమయమయ్యిందే
నీ రక్తముతో నను కడిగి
నాకు విడుదలను దయచేసి
వెలుగుతో నాకు మార్గం చూపావే‖ 2x ‖
Chorus
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును‖ 2x సాటి ఎవ్వరూ ‖

Related Tags

PraiseWorshipGrace