Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saati Laenidhi Yaesuni Rakthamu Paapamunu Kadugunu

సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును

Saati Laenidhi Yaesuni Rakthamu Paapamunu Kadugunu

Intro
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను John 1:7
Chorus
సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపమును కడుగును
Verse
చూడుము సోదర దేవుడు యెంతో - ప్రేమించి యీ జగతిన్
ప్రియుడా ప్రేమించి యీ జగతిన్ - సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను
Verse
లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె - లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్
Verse
విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను - ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి
Verse
యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో
ప్రియుడా విరిగిన హృదయముతో - యేసుని అమూల్య రక్తధారలే
కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల
Verse
పాప భారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా?
ప్రియుడా ప్రయాస మొందెదవా? - పాపమొక్కుకొని యేసు పాదముల
చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము
Verse
గతించుచున్నది స్వల్ప జీవితము - శీఘ్రముగా రమ్ము
ప్రియుడా శీఘ్రముగా రమ్ము - కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము
Verse
కృపాయనందము పవిత్ర ప్రేమతో - భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము - పాప సాగరమును దాటించ గలడు
యేసు రక్షకుడే - ప్రియుడా యెసు రక్షకుడే

Related Tags

Blood Of JesusRepentanceSalvation