Verse
సద్భక్తితోడ సాక్షులై నిత్య
విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా
శ్రీ యేసు నామమున్ స్తుతింతుము
హల్లెలూయా!
Verse
పోరాటమందు వారి దుర్గమౌ
శ్రీ యేసు సంరక్షించు శైలము
అంధత్వ మందు జీవకాంతియు
హల్లెలూయా!
Verse
ఓ యోధులారా! ధైర్యశాలురై
పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ
జీవ కిరీటంబు మీ కబ్బును
హల్లెలూయా!
Verse
ఓ దివ్యసభ! స్నేహభావులు!
అన్యోన్య సహవాసమున్
నమ్మిక గల క్రీస్తువారలు!
హల్లెలూయా!
Verse
మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు
పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా
విజయ గీతితో ఁ గీర్తింతురు
హల్లెలూయా!