Verse
సగం లోకం సగం సంఘం
ఎంతకాలం రెండు పడవల ప్రయాణం
యాకోబు స్వరం ఏశావు వేషం
ఇంకెంత కాలం నులివెచ్చని జీవితం
Verse
వెండి పూత పూసినా
మట్టి కుండ వెండి కుండగునా
పైకి భక్తిగున్నను
హృదయము ప్రభు చూడకుండునా
ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు
పరలోకం చేరలేడుగా
తండ్రి చిత్తం చేయువాడే పరలోకం చేరును
రాకడ గురుతులు జరుగుచుండగా
నిర్లక్ష్యముగా నుందువా
క్రైస్తవుడవని పేరుమోసినా
మోసములోనే బ్రతికెదవా
ఇంకా చాలా సమయముందని
కాలక్ష్యేపం చేసేదవా
నీలో దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో
కడబూర శబ్దం త్వరలో
నిక్కముగా మ్రోగుట తధ్యం
సిద్దపడితే పరలోకం
లేకపొతే నిత్య నరకం
ఇదే తరుణం యేసే శరణం
తప్పించుకో రెండవ మరణం
యేసే మార్గం సత్యం జీవం
యేసే నిత్యజీవము