Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sagilapadi Mrokkedamu Satyamuto Atmatha

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మత

Sagilapadi Mrokkedamu Satyamuto Atmatha

Chorus
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
మన ప్రభుయేసుని ఆ . . ఆ . . ఆ . .
Verse
మోషేకంటె శ్రేష్ఠుడు అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము
Verse
అహరోనుకంటె శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము
Verse
౩. ఆలయముకన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను ఎల్లకాలము మ్రొక్కెదము
Verse 4
యోనకంటె శ్రేష్ఠుడు ప్రాణ దానముగా తను అర్పించెన్
మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము
Verse 5
సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞనమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రొక్కెదము
Verse 6
రాజులకంటె శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము
Verse 7
అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము

Related Tags

PraiseWorshipJesus