Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sahodarulaaraa

సహోదరులారా

Sahodarulaaraa

Verse
సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు‖ 2x ‖
Verse
సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు‖ 2x ‖
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు‖ 2x ‖
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది‖ 2x సహోదరులారా ‖
Verse
దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము‖ 2x ‖
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు‖ 2x ‖
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు‖ 2x సహోదరులారా ‖

Related Tags

Christian LifeDevotionFellowship