Verse
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
Chorus
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము‖ 2x సహోదరులు ‖
Verse
సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి‖ 2x ‖
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను‖ 2x సహోదరులు ‖
Verse
సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు‖ 2x ‖
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను‖ 2x సహోదరులు ‖