Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sainyamula Kadhipativagu Yehova

సైన్యముల కధిపతివగు యెహోవా

Sainyamula Kadhipativagu Yehova

Verse 1
Reference: నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు. కీర్తన Psalm 84:1-7
Verse
సైన్యముల కధిపతివగు యెహోవా
నీ నివాసములు ఎంతో రమ్యములు
Chorus
సైన్యముల యెహోవా
Verse
యెహోవా మందిరము చూడవలెనని
నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను
Verse
జీవముగల దేవుని దర్శించ నా హృదయము
నా శరీర మానంద కేక వేయుచున్నది
Verse
సైన్యముల యెహోవా నా రాజా నీ బలి
పీఠమునొద్దనే పిచ్చుకలకు గూళ్ళు దొరికెను
Verse
పిల్లలు పెట్టుటకు వానకోవెలకు
గూటి స్థలము దొరికెను నా దేవా
Verse
నీ మందిరములో నుండువారు ధన్యులు
వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు
Verse
నీవలన బలము నొందు వారు ధన్యులు
యాత్ర మార్గము లతి ప్రియములు వారికి
Verse
వారు బాకా లోయలోబడి వెళ్లుచు
దానిని జలమయముగా చేయుదురు
Verse
తొలకరి వాన దాని దీవెనలతో కప్పును
వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు
Verse
వారిలో ప్రతివాడు సీయోనులోని
దేవుని సన్నిధిలో కనబడును

Related Tags

PraiseWorshipPsalm