Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sajeeva Saakshulugaa

సజీవ సాక్షులుగా

Sajeeva Saakshulugaa

Verse
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము‖ 2x ‖
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో‖ 2x సజీవ ‖
Verse
తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు‖ 2x ‖
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు‖ 2x సజీవ ‖
Verse
ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా‖ 2x ‖
జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు‖ 2x సజీవ ‖

Related Tags

CommitmentDevotional