Verse
సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా - యేసులో బలపడుమా
జడియకుమా - యేసుకే పరుగెడుమా
Verse
జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం‖ యువ ‖
Verse
ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం‖ యువ ‖
Verse
దేవునితోటయే సంగం
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు బహుమానం‖ యువ ‖