Chorus
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక
గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ‖ సకల ‖
Verse
నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు
బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ‖ సకల ‖
Verse
దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ
వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి‖ సకల ‖
Verse
తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ
కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు‖ సకల ‖
Verse
రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్
జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి‖ సకల ‖