Verse 1
సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము శక్తియు యేసునందున్నవి
Verse
ఆదియందు వాక్యము వాక్యమే ఆ దైవము
జీవము వెలుగును యేసు నందున్నవి
Verse
కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
జగతిలోన జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను
Verse
నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
మృతులను సజీవులనుగా చేయువాడు ఆ దైవమే