Verse
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతి గానమే పెదవుల నిండా
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
Verse
అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
Verse
జీవమార్గం తప్పిపోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
Verse
కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా