Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sakalamu Cheyu

సకలము చేయు

Sakalamu Cheyu

Verse
సకలము చేయు సర్వాధికారి
సర్వ జగతికి ఆధారుడా
నా హృదిలో వసియింప వచ్చినవాడా‖ 2x ‖
ఆరాధ్యుడా నా యేసయ్యా
ఆరాధన నీకే‖ 2x సకలము ‖
Verse
జగద్రక్షకుడా విశ్వవిదాత
సర్వ కృపలకు దాతవు నీవే‖ 2x ‖
బలియైతివా మా రక్షణకై
సర్వ ఘనతలు నీకే ప్రభువా‖ 2x ‖
సర్వ ఘనతలు నీకే ప్రభువా‖ సకలము ‖
Verse
బల శౌర్యము గల యుద్ధ శూరుడవు
సైన్యములకు అధిపతి నీవే‖ 2x ‖
నా జయములన్ని నీవే ప్రభువా
నా ఘనతలన్ని నీకే ప్రభువా‖ 2x ‖
నా ఘనతలన్ని నీకే ప్రభువా‖ సకలము ‖
Verse
కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న
మహిమ గలిగిన రారాజువు నీవే‖ 2x ‖
చీకటి ఎరుగని రాజ్యము నీది
అంతమే లేదు నీ మహిమకు‖ 2x ‖
అంతమే లేదు నీ మహిమకు‖ సకలము ‖

Related Tags

PraiseWorshipAdoration