Verse
సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిఁక నన్ను విడిచిపోవు
టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని
మీ రి క దొలంగుఁడు యేసు నా ర క్షకుఁడు వచ్చెను నన్ను గావను‖ సకలేంద్రియములారా ‖
Verse
పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ
వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు ద లఁచి చూడుఁడు దేవ
కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి‖ సకలేంద్రియములారా ‖
Verse
శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి
విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి
పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది‖ సకలేంద్రియములారా ‖
Verse
కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో
ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన
మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ జూడుఁడు‖ సకలేంద్రియములారా ‖
Verse
రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి
నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని
వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద‖ సకలేంద్రియములారా ‖
Verse
తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి వ
న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా
వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప బోయెద‖ సకలేంద్రియములారా ‖
Verse
ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ
బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక
నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును‖ సకలేంద్రియములారా ‖
Verse
కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ
నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు
గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ గావను‖ సకలేంద్రియములారా ‖
Verse
వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ
కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది
క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద‖ సకలేంద్రియములారా ‖
Verse
ఈ సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని
యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు
నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు‖ సకలేంద్రియములారా ‖