Chorus
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమస్త మానవ
శ్రమాను భవమున్ సహించి వహించి ప్రేమించగల నీ‖ సమాను ‖
Verse
సమాన తత్వము సహోదరత్వము సమంజసము గాను మాకు
దెలుప నీ‖ సమాను ‖
Verse
పరార్ధమై భవ శరీర మొసగిన పరోపకారా నరావ తారా‖ సమాను ‖
Verse
దయా హృదయ యీ దురాత్ము లెల్లరిన్ నయాన భయాన దయాన
బ్రోవ నీ‖ సమాను ‖
Verse
ఓ పావనాత్ముడ ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ
సుతనీ‖ సమాను ‖