Verse
ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము ... లూకా Luke 2:14
Chorus
సమాధానము - దేవుని సమాధానము‖ 2x ‖
ఇష్టులైన మనుష్యులకు సమాధానము
దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము‖ 2x ‖
Verse
దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను
ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి‖ 2x ‖
ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము
Verse
దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు
శాంతి మార్గమును - వారెరుగరనెను
మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము
Verse
ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద
క్షమియించి - పరిశుద్ధునిగా చేయును
అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము
Verse
ఆయన ఉపదేశము - నవలంబించుము
హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను
ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము
Verse
చింతించవలదు - ఏ - విషయమందును
తెలియజేయుడి - దేవునికి విన్నపములతో
తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము
Verse
నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు
ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి
నిన్నాశీర్వదించి - యిచ్చు తన నామమున - సమాధానము