Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samardhavanthudavaina Naa Yesayyaa

సమర్ధవంతుడవైన నా యేసయ్యా

Samardhavanthudavaina Naa Yesayyaa

Verse
సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా‖ 2x ‖
నా స్తుతి యాగము నీకే
నా ప్రాణార్పణ నీకే
నా సర్వస్వము నీకే
నా జీవన గానము నీకే‖ సమర్ధ ‖
Verse
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా
ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా‖ 2x ‖
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా‖ 2x ‖
దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా‖ 2x ‖
నీ సమర్ధ‖ 2x Samardha ‖
Verse
శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా‖ 2x ‖
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా‖ 2x ‖
రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా‖ 2x ‖
నీ సమర్ధ‖ 2x Samardha ‖

Related Tags

PraiseWorshipJesus