Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samarpana Cheyumu Prabhuvunaku

సమర్పణ చేయుము ప్రభువునకు

Samarpana Cheyumu Prabhuvunaku

Verse
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును‖ 2x ‖
Verse
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను‖ 2x ‖
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా‖ 2x ‖
నీవిచ్చెదవా నీవిచ్చెదవా‖ సమర్పణ ‖
Verse
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా‖ 2x ‖
జీవనమంతయు దేవునికిచ్చెను‖ 2x ‖
నీవిచ్చెదవా నీవిచ్చెదవా‖ సమర్పణ ‖
Verse
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము‖ 2x ‖
సజీవ యాగముగా నిచ్చెదవా‖ 2x ‖
నీవిచ్చెదవా నీవిచ్చెదవా‖ సమర్పణ ‖

Related Tags

SurrenderDedicationOffering